News April 6, 2025
నక్కపల్లి: విద్యుదాఘాతంతో సజీవ దహనం

తెగిన విద్యుత్తు తీగపై అడుగేసిన ఓ రైతు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన నక్కపల్లి మండలం జానకయ్యపేటలో శనివారం జరిగింది. పోలీసులకు రైతులు సమాచారం ఇచ్చారు. మృతుడు తాతబ్బాయి అని కుటుంబసభ్యులు గుర్తించడంతో ఎస్‌ఐ సన్నిబాబు కేసు నమోదు చేశారు.
Similar News
News July 8, 2025
HYD: GHMC హెడ్ ఆఫీస్‌లో 2.5 టన్నుల ఈ-వేస్ట్ తొలగింపు..!

స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా HYD జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లోని ఐటీ విభాగం నుంచి 2.5టన్నుల ఈ-వేస్ట్‌ను అధికారులు తొలగించారు. ఇందులో పాత కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్ట్రిడ్జీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఈ-వేస్ట్‌ను ఆసియాలోనే మొదటి LEED ప్లాటినమ్-సర్టిఫైడ్ ఫెసిలిటీ అయిన దుండిగల్ వద్దకు తరలించారు. ఇక్కడే రీసైకిలింగ్ జరుగుతుందని తెలిపారు.
News July 8, 2025
NZB ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా కృష్ణ మోహన్

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ కృష్ణ మోహన్‌ను నియమిస్తూ వైద్య ఆరోగ్య, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం మహేశ్వరం మెడికల్ కళాశాలలో జనరల్ సర్జన్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ శివ ప్రసాద్ కొనసాగుతున్నారు.
News July 8, 2025
చలాన్లు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్?

TG: ట్రాఫిక్ చలాన్లు చెల్లించనివారిపై చర్యలకు రవాణాశాఖ సిద్ధమైంది. మూడు నెలల పాటు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్ చేయాలన్న పోలీసుల ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు కళ్లెం వేయడంతో పాటు భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత 7 నెలల్లో పదేపదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన 18,973 మంది లైసెన్స్‌లను అధికారులు సస్పెండ్ చేశారు.