News July 10, 2024
నక్కపల్లి హాస్పిటల్‌లో వికటించిన ఇంజెక్షన్

నక్కపల్లి ఆస్పత్రిలో మంగళవారం అర్ధరాత్రి టెన్షన్ నెలకొంది. ఆస్పత్రిలోని రోగులకు సిపిటాక్సిం ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్లు వికటించడంతో 23 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ వాంతులై వణుకు మొదలవడంతో రోగులతో పాటు ఆస్పత్రి సిబ్బంది హడలిపోయారు. డా.జయలక్ష్మి సకాలంలో వైద్య సేవలు అందించడంతో 23 మంది రోగులు రికవరీ అయ్యారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News July 6, 2025
విశాఖలో భక్తి శ్రద్ధలతో మొహరం

విశాఖలో మొహరం వేడుకలకు ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చెంగలరావుపేటలోని హుసేని మసీదు ఆధ్వర్యంలో షియా ముస్లింలు హజరత్ ఇమామ్ హుస్సేన్ మరణానికి సానుభూతిగా రక్తం చిందించారు. ఈ కార్యక్రమంలో షియా ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
News July 6, 2025
గిరి ప్రదక్షిణ: పార్కింగ్ ప్రదేశాలివే-2

➣అడవివరం నుంచి గిరిప్రదక్షిణ నిమిత్తం తొలిపావంచకు వచ్చే వారు వాహనాలను అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పెట్టి కాలినడకన రావి చెట్టు జంక్షన్ నుంచి గాంధీనగర్, కోనేరు మీదుగా కలశం జంక్షన్ చేరుకోవాలి
➣ వేపగుంట, గోపాలపట్నం నుంచి వచ్చే భక్తులు సింహపురి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలైన RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో వాహనాలు నిలపాలి.
News July 6, 2025
విశాఖలో రేపు P.G.R.S.

విశాఖలో కలెక్టరేట్, జీవీఎంసీ, సీపీ ఆఫీసుల్లో సోమవారం P.G.R.S. నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉదయం 9.30కు P.G.R.S. ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడించారు. జీవీఎంసీ ఆఫీసులో మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు స్వీకరించనున్నారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులో సీపీ ప్రజల నుంచి వినతులు అందుకోనున్నారు. కాల్ సెంటర్ 1100ను సంప్రదించి కూడా ప్రజలు వినతులను నమోదు చేసుకోవచ్చు.