News September 13, 2024

నగదు వసూలు చేస్తే చర్యలు: కలెక్టర్

image

ఆరోగ్య శ్రీ కింద పేషెంట్ల నుంచి నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రంజిత్ బాషా ఆసుపత్రి యాజమాన్యాలను అదేశించారు. గురువారం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శ్రీ కింద వస్తే ఉచితంగా చికిత్స ఇవ్వాలని, లేకపోతే అప్పుడు వారి నుంచి నగదు తీసుకునే ప్రక్రియను అన్ని ఆసుపత్రులు పాటించాలని అన్నారు.

Similar News

News October 18, 2025

ప్రధాని పర్యటనతో సీమకు ఒరిగిందేంటి?: ఎస్వీ మోహన్ రెడ్డి

image

ప్రధాని మోదీ కర్నూలు, శ్రీశైలం పర్యటనకు రూ.300 కోట్లు ఖర్చు చేసిన సీఎం చంద్రబాబు, రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కూడా మంజూరు చేయించుకోలేదని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనతో సీమకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కర్నూలుకు మంజూరైన హైకోర్టు, లా యూనివర్సిటీని అమరావతికి తరలించడం దుర్మార్గమని మండిపడ్డారు.

News October 18, 2025

మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

image

స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఏ–క్యాంపు మున్సిపల్ పార్కులో జిల్లా కలెక్టర్ సిరి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతి వాడ, ప్రతి కాలనీలో పచ్చదనం విస్తరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

News October 18, 2025

కర్నూలులో ప్రధాని సభ విజయవంతం: సీఎం

image

కర్నూలులో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. శుక్రవారం సాయంత్రం మంత్రులు, ఉన్నతాధికారులు, కర్నూలు-నంద్యాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని నాలుగోసారి రాష్ట్ర పర్యటనలో పాల్గొన్నారని, కర్నూలు సభ గొప్ప విజయం సాధించింది అని సీఎం అన్నారు.