News February 25, 2025

నగరవాసులకు హైడ్రా హెచ్చరిక

image

ప్రజావాణిలో ఫిర్యాదు చేసేటప్పుడు భూ సమస్యలు, కోర్టులో పెండింగ్‌లో ఉంటే వాటి వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలని హైడ్రా సూచించింది. ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వ్యక్తిగత వివాదాలు పరిష్కరించబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూముల అక్రమ కబ్జాలపై మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపింది.

Similar News

News November 4, 2025

గచ్చిబౌలి: కో-లివింగ్‌లో RAIDS.. 12 మంది అరెస్ట్

image

గచ్చిబౌలి TNGOకాలనీలోని కో-లివింగ్ రూమ్స్‌లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైడ్స్‌లో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్‌, ఆరుగురు కన్జ్యూమర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

News November 4, 2025

HYD: పిల్లలకు ఇక నుంచి టిఫిన్!

image

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌‌లోని 3,253 అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం ఉదయం అల్పాహార పథకం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.50 లక్షల మంది చిన్నారులు లబ్ధి పొందనున్నారు. పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారంలో మెరుగుదలతో పాటు పాఠశాల హాజరును పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. మెనూలో ఇడ్లీ, ఉప్మా, రాగి జావ, అటుకుల ఉప్మా వంటి వంటకాలు ఉండనున్నాయి. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

News November 4, 2025

జూబ్లీహిల్స్‌లో HOME VOTING

image

జూబ్లీహిల్స్‌లో EC ఇంటి ఓటింగ్‌ను ప్రారంభించింది. వృద్ధులు, శారీరకంగా వికలాంగులైన ఓటర్లు ఇంటి ఓటింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 85 ఏళ్లు పైబడిన 84 మంది ఓటర్లు, 40 శాతం శారీరకంగా వికలాంగులైన 19 మంది ఓటెస్తారు. ఓటింగ్ సమయం ఉదయం 9 గంటల నుంచి సా. 5 గంటల వరకు ఉంటుంది. అధికారులు వారి ఇళ్లకు వెళ్లి ఓటు వేయడానికి సహాయం చేస్తారు. నవంబర్ 6న కూడా వారు తమ ఇంటి నుంచే ఓటు వేయడానికి అనుమతిస్తారు.