News September 21, 2024

నగరవాసులకు GHMC కమిషనర్ కీలక విజ్ఞప్తి

image

నగరవాసులకు GHMC కీలక విజ్ఞప్తి చేసింది. ‘నగరం అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇంట్లోనే ఉండండి. అనవసర ప్రయాణాన్ని మానుకోండి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, నూతన నిర్మాణాలు, శిథిలావస్థ భవనాలకు దూరంగా ఉండండి. వరదల్లో రోడ్డు దాటే సాహసం చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో 040 21111111నంబర్‌ను సంప్రదించండి. అహోరాత్రులు సేవలు అందించేందుకు మేము అప్రమత్తంగా ఉన్నాం’ అని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు.

Similar News

News October 12, 2024

HYD: ఉప్పల్ వెళ్తున్నారా.. వీటికి నో ఎంట్రీ!

image

HYD ఉప్పల్ స్టేడియంలో మరికాసేపట్లో T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. స్టేడియంలోకి కెమెరా, రికార్డింగ్ పరికరాలకు అనుమతి లేదు. హెడ్ ఫోన్స్, ఇయర్ ప్యాడ్స్, సిగరెట్, అగ్గిపెట్టె, కత్తి, తుపాకీ, కూల్ డ్రింక్స్, పెంపుడు జంతువులు, తినుబండారాలు, బ్యాగులు, ల్యాప్ టాప్, సెల్ఫీ స్టిక్, హెల్మెట్ టపాకాయలు, డ్రగ్స్, సిరంజి, వైద్య పరికరాలు నిషేధమని ఉప్పల్ ట్రాఫిక్ సీఐ లక్ష్మీ మాధవి తెలిపారు.
SHARE IT

News October 12, 2024

హైదరాబాద్‌లో వైన్స్ షాపులకు పోటెత్తారు..!

image

దసరా నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని వైన్స్ షాపులకు మందుబాబులు పోటెత్తారు. ఏ వైన్స్ ముందు చూసినా రద్దీగా కనపడుతోంది. పండుగకు సొంతూరికి వచ్చిన వారితో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు చోట్ల షాపులు తెరవకముందే క్యూ కట్టిన దృశ్యాలు కనిపించాయి.

NOTE: మద్యం తాగి వాహనాలు నడపకండి.

News October 12, 2024

హైదరాబాదీలకు దసరా స్పెషల్ ఏంటి?

image

దసరా వేడుకలు తెలంగాణ వారందరికీ స్పెషల్.. ఇక్కడి వారికి అమ్మమ్మ ఇల్లు యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో HYDలో ఉద్యోగాలు చేస్తూ తిరిగి సొంతూరుకు వెళ్లడం, బంధువులు, దోస్తులతో ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉరెళ్తామని ఎన్నో రకాల పిండివంటలు సిద్ధం చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.