News March 28, 2025
నగర అభివృద్ధిపై దృష్టి సారించాలి: KNR మున్సిపల్ ప్రత్యేక అధికారి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ తో పాటు వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం ఈ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ఆదాయ వ్యయాల అంచనా నివేదికలను కలెక్టర్ పరిశీలించారు. అధికారులు కరీంనగర్ నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
Similar News
News April 4, 2025
కరీంనగర్: నేటి నుంచి జిల్లా ఆసుపత్రి కార్మికుల సమ్మె

నేటి నుంచి ఆసుపత్రి కార్మికులు సమ్మె చేయనున్నారు. కార్మికుల పెండింగ్ జీతాలను చెల్లించాలని కోరుతూ శుక్రవారం నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బండారి శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
News April 4, 2025
జమ్మికుంట: మున్సిపల్ కమిషనర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

ఆస్తిపన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో జమ్మికుంట మొదటిస్థానం దక్కించుకుంది. దీంతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్‌కు మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ కె.శ్రీదేవి హైదరాబాద్‌లో గురువారం రాష్ట్రస్థాయి ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా చొప్పదండి పట్టణంలో 84శాతం ఆస్తిపన్ను వసూలు చేసినందుకు మున్సిపల్ కమిషనర్ నాగరాజును అభినందించారు.
News April 4, 2025
కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసిన మంత్రి పొన్నం బృందం

కేంద్ర సామాజిక న్యాయం,సాధికారత శాఖ మంత్రి డా.వీరేంద్ర కుమార్ తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, BC ఎమ్మెల్యేలలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కుల గణన చేసి అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించామని తెలిపారు. కేంద్రం బిల్లును ఆమోదించి రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని గురువారం వీరేంద్ర కుమార్‌ను మంత్రి కోరారు.