News March 6, 2025

నగర, పురపాలక సంస్థలకు నిధుల విడుదల

image

కర్నూలు నగర, 9 పురపాలక సంస్థలకు 2023-24కు గానూ 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.41.19 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కర్నూలుకు రూ.15.81 కోట్లు, గూడూరుకు రూ.1.08 కోట్లు, ఆదోనికి రూ.5.47 కోట్లు, ఎమ్మిగనూరుకు రూ.3.08 కోట్లు, నంద్యాలకు రూ.7.15 కోట్లు, ఆళ్లగడ్డకు రూ..82 కోట్లు, డోన్‌కు రూ.1.92 కోట్లు, నందికొట్కూరుకు రూ.1.63 కోట్లు, ఆత్మకూరుకు రూ.1.76 కోట్లు, బేతంచెర్లకు రూ.1.43 కోట్లు ఇచ్చింది.

Similar News

News March 6, 2025

ఆళ్లగడ్డలో ఉచితంగా ‘ఛావా’ చిత్రం ప్రదర్శన

image

ఛత్రపతి శివాజీ కొడుకు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా‘ చిత్రం ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్‌లో నేడు ఉచితంగా ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి 3 షోలు ప్రదర్శిస్తున్నామని థియేటర్ ప్రొప్రైటర్ అట్లా దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా థియేటర్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క హిందూ సోదరులు సినిమాను చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

News March 6, 2025

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా గురువారం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా కలెక్టర్ రంజిత్ బాషా కర్నూలులోని ఉస్మానియా కళాశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రంలో మెరుగైన వసతులు కల్పించామని అన్నారు. విద్యార్థులకు ఏ అవస్థలు కలగకుండా అన్ని చర్యలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కలెక్టర్ వెంట ఇంటర్ బోర్డు అధికారులు ఉన్నారు.

News March 6, 2025

కర్నూలు: బొలెరో, బైక్ ఢీ.. వ్యక్తి దుర్మరణం

image

నందవరం మండలంలోని జోహారాపురం గ్రామ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురువ చదువుల చక్రవర్తి(23) వ్యక్తిగత పనుల మీద బైకుపై వెళ్తుండగా పోలకల్ నుంచి రాయచూర్‌కు కందులు తరలిస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో చక్రవర్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు జయమ్మ, పోసరప్ప కుమారుడిగా గుర్తించారు.

error: Content is protected !!