News March 6, 2025
నగర, పురపాలక సంస్థలకు నిధుల విడుదల

కర్నూలు నగర, 9 పురపాలక సంస్థలకు 2023-24కు గానూ 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.41.19 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కర్నూలుకు రూ.15.81 కోట్లు, గూడూరుకు రూ.1.08 కోట్లు, ఆదోనికి రూ.5.47 కోట్లు, ఎమ్మిగనూరుకు రూ.3.08 కోట్లు, నంద్యాలకు రూ.7.15 కోట్లు, ఆళ్లగడ్డకు రూ..82 కోట్లు, డోన్కు రూ.1.92 కోట్లు, నందికొట్కూరుకు రూ.1.63 కోట్లు, ఆత్మకూరుకు రూ.1.76 కోట్లు, బేతంచెర్లకు రూ.1.43 కోట్లు ఇచ్చింది.
Similar News
News December 13, 2025
HYD: ప్రముఖుల బసకు చిరునామా.. ఫలక్నుమా

ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొననున్నారు. దీని కోసం హైదరాబాద్కు వచ్చిన మెస్సీకి ప్రభుత్వం ఫలక్నుమా ప్యాలెస్లో బస ఏర్పాటు చేసింది. ఫలక్నుమా ప్యాలెస్ ప్రముఖులు బస చేసేందకు చిరునామాగా మారింది. దీన్ని 1893లో నిర్మించగా 1895 నుంచి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గెస్ట్ హౌస్గా వాడేవారు. ప్రస్తుతం తాజ్ గ్రూప్ ప్యాలెస్ను లీజ్ తీసుకుంది.
News December 13, 2025
MBNR: గెలుపు కోసం.. గౌను ధరించాడు..!

మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్ 1వ వార్డు అభ్యర్థి నారాయణగౌడ్ తన ఎన్నికల గుర్తు ‘గౌను’ను ప్రచారం కోసం వినూత్నంగా ఉపయోగించారు. గుర్తు అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఆయన గౌను ధరించి తమ వార్డులో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ఈ ప్రచార పద్ధతి స్థానికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. నారాయణ గౌడ్ ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆసక్తిగా చూశారు.
News December 13, 2025
IHFMS టెండర్లలో భారీగా అవకతవకలు!

రాష్ట్రంలోని ప్రభుత్వ టీచింగ్, మెడికల్ కాలేజీల్లో శానిటేషన్, పేషెంట్ కేర్ సేవలను మెరుగుపరిచేందుకు తెచ్చిన నూతన పాలసీకి కాంట్రాక్టర్లు అడ్డంకిగా మారారు. 2024లో కాంట్రాక్టు అసోసియేషన్ కోర్టుకు వెళ్లగా, ప్రభుత్వం నేటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ప్రతీ కాంట్రాక్టర్ నెలకు లక్షల ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.


