News April 24, 2024

నట్టడవిలో లింగమయ్య నామస్మరణ

image

తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య జాతరకు తొలిరోజు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రాత్రి సమయంలో భక్తులను అనుమతి లేకపోవడంతో లింగమయ్యను దర్శించుకొనేందుకు పగలే బారులు తీరారు. ఎండ తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడ్డారు. చెంచు పూజారులు లింగమయ్యకు గిరిజన సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. ఇరుకైన కొండ, కోనల్లో నడక సాగిస్తూ సలేశ్వరం జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు.

Similar News

News October 19, 2025

MBNR: దీపావళి.. ఎస్పీ కీలక మార్గదర్శకాలు

image

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పండుగకు కొన్ని కీలక మార్గదర్శకాలు చేశారు. లైసెన్స్ పొందిన విక్రేతల వద్ద మాత్రమే బాణసంచా కొనాలని, బహిరంగ ప్రదేశాలలోనే కాల్చాలని సూచించారు. మండే పదార్థాలకు దూరంగా ఉండాలని, సింథటిక్ కాకుండా కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు. పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పటాకులు కాల్చాలని సూచించారు.

News October 19, 2025

కురుమూర్తి ఆలయ హుండీ లెక్కింపు రూ.4.48 లక్షల ఆదాయం

image

చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపురం గ్రామ సమీపంలో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయంలో అమావాస్య, శని, సోమవారాలను పురస్కరించుకొని భక్తులు సమర్పించిన హుండీ డబ్బులను శనివారం ఆలయ సిబ్బంది లెక్కించారు. హుండీ ద్వారా రూ.4,48,248 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News October 18, 2025

MBNR: బీసీ బిల్లును అమలు చేయాలి

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ దగ్గర శనివారం బీసీ ఉమ్మడి జిల్లా జేఏసీ ఛైర్మన్ బెక్కం జనార్దన్, వివిధ సంఘాల నాయకులు బీసీ బంద్‌ను నిర్వహించారు. జేఏసీ ఛైర్మన్ మాట్లాడుతూ.. బీసీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తీసుకొచ్చి 42% బీసీ బిల్లు అమలు చేస్తూ, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జలజం రమేష్, ప్రభాకర్, శ్రీనివాసులు, రామ్మోహన్ జి పాల్గొన్నారు.