News May 18, 2024
నడవడిక మార్చుకుంటే రౌడీ షీట్లు ఎత్తివేస్తాం: సీఐ
శ్రీకాకుళం జిల్లాలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఉమామహేశ్వరరావు పలువురికి మంచిని బోధించారు.
తెలిసో తెలియక చేసిన తప్పులు కారణంగా సమాజంలో రౌడీషీటర్లుగా ముద్రపడే వారంతా నడవడిక మార్చుకుంటే రౌడీ షీట్లు ఎత్తివేస్తామన్నారు. ఎస్పీ రాధిక ఆదేశాలతో శుక్రవారం స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లతో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఉన్న మాదిరిగానే మిగతా సమయంలోను ప్రశాంతంగా కుటుంబంతో గడపాలన్నారు.
Similar News
News December 9, 2024
SKLM: మంత్రి నాదెండ్లను కలిసిన జనసేన నేతలు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను విజయనగరం జిల్లాలోని భోగాపురం రిసార్ట్‌లో సోమవారం శ్రీకాకుళం జనసేన జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి పీసీనీ చంద్రమోహన్, జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీనువాసరావు, తాళాబత్తుల పైడిరాజు, చిట్టి భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
News December 9, 2024
వీరఘట్టం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వీరఘట్టం మండలం వండువ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరఘట్టంకు చెందిన కూర్మాన అశోక్ చక్రవర్తి (35) అనే వ్యక్తి మృతి చెందాడు. కొంతకాలంగా పాలకొండలో నివాసం ఉంటున్న అతడు ఆదివారం వీరఘట్టం వచ్చి తిరిగి పాలకొండ వెళుతుండగా మార్గ మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 8, 2024
SKLM: రైల్వే అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులపై విశాఖపట్నంలో ఆదివారం డివిజన్ సమావేశం నిర్వహించారు. సమీక్షలో మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. అమృత భారత్‌లో భాగంగా శ్రీకాకుళం నౌపాడ స్టేషన్ల అభివృద్ధి చేయాలని, నౌపాడ -గుణుపూర్ లైన్ క్రాసింగ్ స్టేషన్ నిర్మాణం, టెక్కలి పాతపట్నం స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పొందూరు – పలాస మధ్య జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు.