News July 13, 2024

నడిరోడ్డుపై ప్రయాణికులకు అగచాట్లు

image

విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం అర్ధరాత్రి బాపులపాడు మం. వీరవల్లి వద్ద మొరాయించింది. బస్సుకు మరమ్మతు చేయకుండా డ్రైవర్, క్లీనర్ పరారవ్వడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. దీంతో వీరవల్లి పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను పరిష్కరించారు. బస్ యాజమాన్యం టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వడంతో ఇతర బస్సుల్లో వెళ్లిపోయారు.

Similar News

News October 30, 2025

కృష్ణా: ఉద్యాన పంటలపై మొంథా పంజా

image

మొంథా తుపాన్ ఉద్యాన పంటల రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. జిల్లాలో 1416 హెక్టార్లలో ఉద్యాన పంటలు (అరటి, మొక్కజొన్న, పసుపు, చెరకు తదితరాలు) దెబ్బతిన్నాయి. ఈ పంటలపై ఆధారపడిన 2,229 మంది రైతులు రూ. 73.46 కోట్ల మేర నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు.

News October 30, 2025

కోడూరు: పవన్ పంట పొలాలను పరిశీలించే స్థలం ఇదే.?

image

తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. కోడూరు మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణాపురం ఆర్సీఎం చర్చి వద్ద తుపాన్ తాకిడికి నేలకి వోరిగిన వరిపైరును పరిశీలించనున్నారు. వ్యవసాయ అధికారులు తుపాన్ నష్టాన్ని అంచనా వేసి పవన్‌కి వివరించనున్నారు. పోలీస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

News October 30, 2025

అవనిగడ్డ నియోజకవర్గంలో నేడు పవన్ కళ్యాణ్ పర్యటన

image

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం కోడూరు మండలంలో పర్యటించనున్నట్లు ఏపీ సెక్రటరీ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, 8:30 గంటలకు నాగాయలంకలో, 10:30 గంటలకు కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన ప్రకటనలో వివరించారు.