News August 13, 2024

నత్తనడకన హెచ్‌ఎండీఏ తరలింపు!

image

హెచ్‌ఎండీఏ తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే నగరంలో పలు చోట్ల ఉన్న హెచ్‌ఎండీఏ విభాగాలన్నింటినీ ఒకే చోటకు తరలించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నెమ్మదిగా సాగుతున్న పనుల మూలంగా కేంద్రీకృతానికి జాప్యం జరగనుంది. పైగా ప్యాలస్‌లో ఇప్పటికీ కొనసాగుతున్న నిర్మాణ పనులతో తరలింపు ప్రక్రియ ఎప్పుడనేది ఇంకా స్పష్టత రావడంలేదు.

Similar News

News November 9, 2025

HYD: అవినీతి పాలనకు ముగింపు పలకాలి: BJP

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళ్‌రావునగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా BRS పాలనలో.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ HYD అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, ప్రజలు ఈసారి అవినీతి, మోసపూరిత పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

News November 9, 2025

రాయదుర్గం PSలో మాగంటి గోపీనాథ్ తల్లి ఫిర్యాదు

image

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని గోపీనాథ్ మృతి ఆయన తల్లి రాయదుర్గం PSలో ఫిర్యాదు చేశారు. మాగంటి మహనంద కుమారి కుమారుడు మరణంపై పోలీసులు దర్యాప్తు చెయ్యాలని సూచించారు. మృతికి సంబంధించి మొదటి నుంచి తల్లి మహానందకుమారి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి తెలిసిందే.

News November 8, 2025

గ్యారెంటీలకు జూబ్లీహిల్స్‌లో BRS గెలవాలి: హరీశ్‌రావు

image

సునీతమ్మను అవహేళన చేసిన కాంగ్రెస్ నాయకులకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజలకు, బస్తీ వాసులకు అండగా నిలిచారని అన్నారు. షేక్‌పేట్‌లోని అంబేడ్కర్ నగర్‌ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.