News March 21, 2024
నన్ను ఎంపీగా గెలిపించండి: వంశీ చంద్ రెడ్డి
పాలమూరు బిడ్డగా రాష్ట్రంలోనే తొలి జాబితాలో ఎంపీ టికెట్ దక్కే అవకాశం లభించిందని, తనను గెలిపించే బాధ్యత కూడా ఇదే పాలమూరు బిడ్డలు తీసుకోవాలని CWC ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీ చంద్ రెడ్డి కోరారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. గత పది ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప అధికారులు ప్రజాప్రతినిధులకు ఎవరికీ అధికారం ఇవ్వకుండా కేవలం ఏకపక్షంగా వ్యవహరించాలని ఆరోపించారు.
Similar News
News September 10, 2024
లక్ష్మారెడ్డి సతీమణి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
మాజీ మంత్రి, BRS మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి(60) సోమవారం రాత్రి మృతిచెందారు. కాగా శ్వేతా మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. లక్ష్మారెడ్డికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియలకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించారు.
News September 10, 2024
MBNR: మరణంలోనూ వీడని స్నేహం
షాద్నగర్ సమీపంలోని ఎలికట్ట శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. కొందర్గు మండలానికి చెందిన కరుణాకర్, శేఖర్ ప్రాణ స్నేహితులు. వీరు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు షాద్నగర్లో కలుసుకున్నారు. మద్యం సేవించి బైక్పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.
News September 10, 2024
MBNR: భారీగా తగ్గిన చికెన్ ధరలు
పాలమూరు జిల్లాలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గతవారం కిలో రూ. 200లకు పైగానే విక్రయించారు. గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో మాంసం విక్రయాలు క్రమంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ కిలో రూ. 161, స్కిన్ లెస్ రూ. 183, ఫాంరేటు రూ. 89, రిటైల్ రూ. 111 చొప్పున విక్రయిస్తున్నారు.
SHARE IT