News November 27, 2024

నన్ను కొట్టిన వాళ్లంతా జైలుకు వెళ్తారు: RRR

image

ఉండి MLA, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు(RRR) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత ప్రభుత్వంలో నాపై కేసు పెట్టారు. విచారణలో భాగంగా కొందరు అధికారులు నన్ను కొట్టారు. ఇప్పుడు వాళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం. సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్ అరెస్ట్‌ను స్వాగతిస్తున్నా. ఈ కేసులో కీలకంగా ఉన్న సీఐడీ మాజీ చీఫ్ సునీల్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి’ అని RRR కోరారు.

Similar News

News December 22, 2025

ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం సమీక్షించారు. ఆప్షన్-3, PMAY 1.0 ఇళ్ల నిర్మాణాల్లో అజయ్ వెంచర్స్, పల్లా ఏసుబాబు, జి.వెంకటేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి సత్వరమే లబ్ధిదారులకు అప్పగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తేదారులను హెచ్చరించారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 22, 2025

భీమవరం: నేడు PGRS కార్యక్రమం

image

భీమవరం కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయాలకు రాలేనివారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.