News April 28, 2024

నన్ను గెలిపిస్తే ప్రజాసేవకుడిగా నిలిచిపోతా : రఘురాంరెడ్డి

image

ఆయోధ్యలో రామాలయం కట్టి బీజేపీ పార్టీ ఓట్లు అడుగుతోందని, తాము సైతం మరిపెడలో అతిపెద్ద రామాలయాన్ని నిర్మించామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తనను దొర అని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు, మరిపెడ, చేగొమ్మలో తన ఆస్తులను ప్రజల అవసరాల కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తించాలని సూచించారు. తనను గెలిపిస్తే ప్రజల సేవకుడిగా నిలిచిపోతానని చెప్పారు.

Similar News

News April 14, 2026

ఖమ్మం జిల్లాలో పెరిగిన కూలీ రేట్లు

image

ఖమ్మం జిల్లాలో సుతారీ మేస్త్రీలు, సహాయ కార్మికుల కూలీ రేట్లు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం బిల్డర్స్ అసోసియేషన్, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మేస్త్రీ కూలీ రూ.950 నుంచి రూ.1,050కు, సహాయకుల కూలీ రూ.670 నుంచి రూ.735కు పెంచినట్లు డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

News April 14, 2026

KMM: వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు ఎక్కువగా తాగాలని కోరారు. చిన్నారులు, వృద్ధులు ఎండలో తిరగవద్దని, గొడుగు లేదా టోపీ ధరించాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, తగిన జాగ్రత్తలతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.