News April 11, 2024

నన్ను చంపేందుకు కుట్ర: పుట్ట మధు

image

తనను చంపేందుకు కాంగ్రెస్‌ నాయకులు కుట్రలు చేస్తున్నారని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు అన్నారు. పదవీకాలం ముగిసిన వెంటనే గన్‌మెన్లను తొలగించి హతమార్చేందుకు పథకం రూపొందించారని సంచలన ఆరోపణలు చేశారు. మంథని ప్రజల ఆశీర్వాదంతో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా, జడ్పీ ఛైర్మన్‌గా ఎదిగిన తనపై కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసి ప్రజల నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 17, 2025

జమ్మికుంటలో పత్తి కొనుగోళ్లు బంద్

image

CCI L- 1, L- 2 విధానాలు, స్లాట్ బుకింగ్ వల్ల రైతులు, జిన్నింగ్ మిల్లులు ఇబ్బందులు పడుతున్నాయని జమ్మికుంట మార్కెట్ కమిటీ తెలిపింది. వినతులు ఇచ్చినా చర్యలు లేకపోవడంతో జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పిలుపుమేరకు నేటి నుంచి జమ్మికుంటలో CCI, ప్రైవేట్ కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రైతులు పత్తిని మార్కెట్‌ యార్డు, మిల్లులకు తీసుకురావద్దని, ‘కపాస్ కిసాన్’లో స్లాట్ బుక్ చేయవద్దని సూచించారు.

News November 16, 2025

కరీంనగర్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, వీణవంక, జమ్మికుంట, మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్<<>> చేసి వివరాలు నమోదు చేయండి.

News November 16, 2025

కరీంనగర్: ఓటరు జాబితా సవరణపై సీఈఓ సమీక్ష

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని అన్ని ఈఆర్ఓలు, ఏఆర్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతిని, పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను ఆయన సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ కలెక్టరేట్ నుండి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.