News April 11, 2024
నన్ను చంపేందుకు కుట్ర: పుట్ట మధు

తనను చంపేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అన్నారు. పదవీకాలం ముగిసిన వెంటనే గన్‌మెన్లను తొలగించి హతమార్చేందుకు పథకం రూపొందించారని సంచలన ఆరోపణలు చేశారు. మంథని ప్రజల ఆశీర్వాదంతో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా, జడ్పీ ఛైర్మన్‌గా ఎదిగిన తనపై కాంగ్రెస్ నేతలు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసి ప్రజల నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 16, 2025
కరీంనగర్: 454 మందికి రేపు అగ్ని పరీక్ష

కరీంనగర్ జిల్లాలో మూడో దఫా గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 108 గ్రామాలలో 454 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీపడుతున్నారు. హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక మండలాల్లోని 108 సర్పంచ్, 1034 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు మండలాలలో 1,59,647 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 16, 2025
KNR: మార్చిలోగా అమృత్-2 పనులు పూర్తి చేయాలి: సీడీఎంఏ

కరీంనగర్ జిల్లాలో అమృత్-2 పథకం కింద చేపట్టిన మంచినీటి సరఫరా పనులను మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేయాలని సీడీఎంఏ శ్రీదేవి కమిషనర్లను ఆదేశించారు. పైప్‌లైన్, రిజర్వాయర్ల నిర్మాణాల పురోగతిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి పురోగతిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.