News January 27, 2025
నమ్మండి.. నిజంగా ఇది బడే..!

మైదాన, పట్టణ ప్రాంతాల్లో అధునాతన సదుపాయలతో పాఠశాల భవనాలను మనం చూశాం. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు గిరిశిఖర గ్రామాల్లో తడకల గోడల మధ్యే అక్షరాలు దిద్దుతున్న చిట్టి చేతులు ఎన్నో ఉన్నాయి. చదివేందుకు కనీసం సదుపాయాలు లేక ఆ చిన్నారుల బాధలు వర్ణనాతీతం. ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ కేందుగూడలో పాఠశాల పరిస్థితిపై ఫొటోలో మనం చూడొచ్చు. ఈ పాఠశాలలో 26 మంది విద్యార్థులు చదువుతున్నారు.
Similar News
News December 13, 2025
పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష

రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులకు ఆదేశించారు. ఎస్పీ రోహిత్ రాజు, జనరల్ అబ్జర్వర్ సర్వేశ్వర్ రెడ్డి, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లావణ్య, ఎంపీడీఓ, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షా సమావేశంలో సూచనలు చేశారు.
News December 13, 2025
KNR: అక్కా.. ఫ్రీ బస్సులో వద్దు, లగ్జరీలో రా.!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, మూడో విడత ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణాల్లో ఉన్న ఓటర్లను, ముఖ్యంగా మహిళా ఓటర్లను, పల్లెలకు రప్పించేందుకు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. “అక్కా.. ఫ్రీ బస్సులో ఇబ్బంది పడొద్దు, సూపర్ లగ్జరీలో రా” అంటూ ఫోన్లు చేసి ఓటు కోసం ప్రేమను ఒలకబోస్తున్నారు.
News December 13, 2025
పాల మొదటి 2 ధారలు, గోటి పరీక్ష ముఖ్యం

☛ కొన్ని గేదెల పొదుగు పెద్దగా ఉన్నా లోపల పొదుగు వాపు ఉండే ఛాన్సుంది. అందుకే నల్లటి గిన్నెలో పాలను పితికి మొదటి రెండు ధారలను పరిశీలించాలి. అందులో గడ్డలు, రక్తం లేదా నీళ్ల విరుగుడు కనిపిస్తే ఆ గేదెను కొనవద్దు.
☛ మెషిన్ లేకుండానే పాలలో వెన్నశాతం చెక్ చేయాలి. దీనికి పాలు పితికిన వెంటనే ఒక చుక్కపాలను బొటన వేలు గోరు మీద వేయాలి. ఆ చుక్క జారిపోకుండా గోరు మీదే ఉంటే అవి చిక్కటి పాలుగా గుర్తించాలి.


