News January 27, 2025
నమ్మండి.. నిజంగా ఇది బడే..!

మైదాన, పట్టణ ప్రాంతాల్లో అధునాతన సదుపాయలతో పాఠశాల భవనాలను మనం చూశాం. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు గిరిశిఖర గ్రామాల్లో తడకల గోడల మధ్యే అక్షరాలు దిద్దుతున్న చిట్టి చేతులు ఎన్నో ఉన్నాయి. చదివేందుకు కనీసం సదుపాయాలు లేక ఆ చిన్నారుల బాధలు వర్ణనాతీతం. ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ కేందుగూడలో పాఠశాల పరిస్థితిపై ఫొటోలో మనం చూడొచ్చు. ఈ పాఠశాలలో 26 మంది విద్యార్థులు చదువుతున్నారు.
Similar News
News February 19, 2025
పాడేరు: అసంఘటితరంగ కార్మికులను ఈ-శ్రమ పోర్టల్లో నమోదు చేయాలి

అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ పోర్టల్లో నమోదు చేయాలని అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ బుధవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ పోర్టల్ అందుబాటులోకి తీసుకుని వచ్చిందన్నారు. వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను ఈ-శ్రమలో నమోదు చేసి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను అందించాలన్నారు.
News February 19, 2025
HYD: గుండెపోటుతో మరో లాయర్ మృతి..!

HYDలో నేడు మరో లాయర్ గుండెపోటుతో మృతి చెందారు. తార్నాకకు చెందిన లాయర్ వెంకటరమణ మారేడ్‌పల్లిలోని ఇండియన్ బ్యాంక్‌లో చలానా కట్టేందుకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారని స్థానికులు తెలిపారు. హుటాహటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిన్న హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే లాయర్ వేణుగోపాల్ రావు మరణించిన సంగతి తెలిసిందే. వరుస గుండెపోటు మరణాలు HYDలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
News February 19, 2025
ఆరంభంలోనే పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతోంది. కాగా ప్రేక్షకులు లేక కరాచీ స్టేడియం వెలవెలబోతోంది. గ్రౌండ్‌లో ఎక్కడ చూసినా ఖాళీ స్టాండ్స్ దర్శనమిస్తున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో క్రికెట్ ప్రేమికులు పాకిస్థాన్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇంత పెద్ద టోర్నీని చూసేందుకు పాక్ ఫ్యాన్స్ ఆసక్తి చూపడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.