News July 21, 2024
నమ్మకం కలిగేలా పని చేయండి: జిల్లా కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాలు ఉన్నా రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు వెళ్తున్నారని కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ ప్రభుత్వ వైద్యాధికారులును ప్రశ్నించారు. శనివారం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన కేసుల్లో వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. నమ్మకం కలిగించేలా పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శతశాతం ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవకన్నారు.
Similar News
News December 27, 2025
VZM: ఎస్పీ దామోదర్‌కు సీనియర్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి

2013వ సంవత్సరం బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు సెలెక్షన్ గ్రేడ్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా ప్రభుత్వం పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్‌కు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి ఇచ్చి, ఇదే జిల్లాలో సీనియర్ ఎస్పీగా కొనసాగాలని శనివారం ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతి సందర్భంగా జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది ఎస్పీకు శుభాకాంక్షలు తెలిపారు.
News December 27, 2025
నేరాల నియంత్రణకు సమన్వయం అవసరం: VZM ఎస్పీ

నేరాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. శనివారం విజయనగరంలో నిర్వహించిన వార్షిక నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. మహిళలపై దాడుల కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చర్యల్లో జిల్లా తొలి స్థానంలో నిలిచిందని తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకొని 18 గ్యాంగులపై నిఘా, రూ.4 కోట్ల ఆస్తుల ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు.
News December 27, 2025
VZM: కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో సి కేటగిరీలో ఉన్న కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు అన్ని ఏ ప్లస్ కేటగిరీకి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో కేపీఐలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయిలో 90, మండల స్థాయిలో 82 పారామీటర్లు వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.


