News October 14, 2024
నరకాసుర వధ వేడుకకు ఆహ్వానించిన ఉత్సవ కమిటీ
వరంగల్ నగరంలోని ఉర్సు గుట్ట వద్ద ఈనెల 30న దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వధను నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ మేరకు సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదను అతిథిగా హాజరుకావాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి ఆహ్వానించారు. నగరంలోని ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని కోరారు.
Similar News
News November 11, 2024
వరంగల్ మార్కెట్ నేడు పునఃప్రారంభం
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునఃప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News November 10, 2024
పరకాల: కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు
హనుమకొండ జిల్లా కేంద్రానికి వచ్చిన కేటీఆర్‌ను మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ధర్మారెడ్డి, శంకర్ నాయక్, ముఖ్య నేతలు కలిశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యేలు వివరించారు. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చింతం సదానందం, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
News November 10, 2024
కులగణన సర్వేలో తప్పులు దొర్లితే సిబ్బందిపై చర్యలు: కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కుటుంబాలకు అనుగుణంగా ఎన్యుమరేటర్‌లను నియమించమన్నారు. సర్వే ఫారంలో ఉన్న 75 ఖాళీలను పూర్తిగా నింపి కులగణన సమగ్రంగా ఉండేలా ఎన్యుమరేటర్‌లు చూడాలన్నారు.