News May 4, 2024

నరసన్నపేటకు రానున్న చంద్రబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. ఆరోజు నరసన్నపేట నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. విజయవాడ నుంచి 9న ఉదయం 11 గంటలకు నరసన్నపేట చేరుకుంటారని, అనంతరం చీపురుపల్లి వెళ్తారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకట రమణ తెలిపారు.

Similar News

News December 9, 2025

ఎచ్చెర్ల: ప్రారంభమైన మూడో సెమిస్టర్ పరీక్షలు

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 10 కోర్సులకు సంబంధించి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ ఎన్.లోకేశ్వరితో కూడిన అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.

News December 9, 2025

శ్రీకాకుళం: ‘లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 47 మందిపై కేసులు నమోదు చేశాం’

image

శ్రీకాకుళం జిల్లాలో గడచిన 5 సంవత్సరాల్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 47 మందిపై కేసులు నమోదు చేశామని జిల్లా అవినీతి నిరోధక శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ కేసులలో అధికారులు, ఉద్యోగులు ఉండగా వారిలో కొంతమంది జైలుకు వెళ్లగా మరి కొంతమంది కోర్టుల్లో విచారణ ఎదుర్కొంటున్నారన్నారు.

News December 9, 2025

శ్రీకాకుళం: తల్లి మందలించిదని పురుగులమందు తాగి యువతి ఆత్మహత్య

image

రణస్థలం మండలం ముక్తంపురానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తి (16) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. జే.ఆర్.పురం పోలీసులు వివరాలు మేరకు.. కీర్తి ఈనెల 6న ఇంట్లో TV చూస్తుండగా తన తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన కీర్తి పురుగులమందు తాగింది. దీంతో ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.