News May 4, 2024
నరసన్నపేటకు రానున్న చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. ఆరోజు నరసన్నపేట నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. విజయవాడ నుంచి 9న ఉదయం 11 గంటలకు నరసన్నపేట చేరుకుంటారని, అనంతరం చీపురుపల్లి వెళ్తారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకట రమణ తెలిపారు.
Similar News
News December 11, 2025
శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీకి చెందిన బగాది కృష్ణారావు (86) గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ సుజాత, ఉమా శంకర్ వచ్చి కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
News December 11, 2025
శ్రీకాకుళం: జైల్లో పరిచయం.. బయటకొచ్చి దొంగతనాలు

బూర్జలో చోరీలకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖ, కోనసీమ, బిహార్‌కు చెందిన నాగరాజు, ఆనంద్, శ్రీను, చంటిబాబు, శుభం మిశ్రా పాత కేసుల్లో జైలుకెళ్లారు. బయటొచ్చాక గాజువాకలో స్థిరపడ్డారు. శ్రీను అత్తగారి ఊరు శ్రీకాకుళం జిల్లా బూర్జ. ఆ గ్రామానికి చెందిన రమేశ్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని శ్రీను గమనించాడు. ఈ నెల 1న అందరూ కలిసి దొంగతనం చేసినట్లు DSP వివేకానంద తెలిపారు.
News December 11, 2025
శ్రీకాకుళం కలెక్టర్‌కు 15వ ర్యాంక్

సిక్కోలు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 15వ ర్యాంకు సంపాదించారు. ఆయన వద్దకు ప్రజల సమస్యలపై 931 ఫైల్స్ రాగా 703 పరిష్కరించారు. ఒక్కో ఫైల్‌ను పరిష్కరించేందుకు ఆయన 2 రోజుల 3 గంటల సమయం తీసుకున్నారు. దీంతో ఆయన పనితీరుకు CM చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాంక్ ఇచ్చారు


