News December 23, 2024
నరసన్నపేటలో యాక్సిడెంట్.. యువకుడు మృతి
నరసన్నపేటలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే సర్వీస్ రోడ్డులో పశుసంవర్ధక శాఖ అంబులెన్స్, బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎం.జగదీశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. సాయి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 18, 2025
SKLM: కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షకు చేరినవారు వీరే.!
పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలు ఎచ్చెర్ల పోలీస్ ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా పురుష అభ్యర్థులు 327 మంది దేహ దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించారని జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు.
News January 18, 2025
శ్రీకాకుళం: జనసేన నాయకురాలు కాంతిశ్రీ మృతి
ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతి శ్రీ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. అనారోగ్యంతో గొలివి ఆసుపత్రిలో చేరిన ఆమె నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా ఈమె ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఆర్థిక సహాయాలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పార్థివదేహాన్ని సందర్శనార్థం 9 తర్వాత స్వగృహానికి తెస్తారని తెలిపారు.
News January 18, 2025
చంద్రబాబు మీటింగ్‌కి పలువురు మంత్రులు గైర్హాజరు
CM చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలో పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, MP గంటి హరీశ్, అంబికా లక్ష్మీ నారాయణలు గైర్హాజరయ్యారు. కమిటీ మీటింగులు, ఇతర పనులు పార్టీ మీటింగ్ కంటే ఎక్కువా? అని CM సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.