News April 6, 2024
నరసన్నపేటలో రోడ్డు ప్రమాదం.. వృద్ధురాలి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన నరసన్నపేటలో జరిగింది. మండలంలోని సుందరాపురం పంచాయతీకి చెందిన మురపాక గౌరమ్మ(80) ఇటీవల ఎచ్చెర్ల మండలంలోని తోటపాలెంలో ఉంటున్న ఆమె కూతురు ఇంటికి వెళ్లింది. శనివారం గౌరమ్మ తన కుమార్తె, అల్లుడితో కలిసి ఆటోలో వెళ్తుండగా.. వీఎన్‌పురం రహదారిపై ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌరమ్మ మృతి చెందింది.
Similar News
News January 20, 2025
SKLM: నేటి నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 20 నుంచి 31వతేదీ వరకు అన్ని మండలాల్లో రోజుకు రెండు పంచాయితీల చొప్పున పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ జేడీ డాక్టర్ కె.రాజ్ గోపాల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి ఈ శిబిరాలు నిర్వహిస్తామని, పశువులకు సాధారణ చికిత్సలు, గర్భకోస వ్యాధులకు పరీక్షలు చేసి మందులు అందిస్తామన్నారు.
News January 19, 2025
ఇచ్ఛాపురం: రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి
ఇచ్ఛాపురం పట్టణంలోని సంతపేట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం బోనసాల ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంతపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు బలంగా ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, సోంపేట ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు వ్యక్తులను గాయపడ్డారు. క్షతగాత్రులను ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 19, 2025
పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉరివేసుకుని పేషంట్ మృతి
పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉరివేసుకుని బెవర జోగినాయుడు అనే పేషంట్ ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన ఈయన పాంక్రియాటైటిస్‌తో బాధపడతూ శనివారం ఆసుపత్రిలో చేరారు. ఏం జరిగిందో ఏమో గాని ఆదివారం మేల్ వార్డు బాత్రూంలో ఉరి వేసుకుని సూసైడ్‌కు పాల్పడ్డాడు. మృతునికి భార్య కళ్యాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.