News September 16, 2024
నరసన్నపేట: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

నరసన్నపేట పట్టణంలోని కలివరపుపేట వీధికి చెందిన వైశ్యరాజు నాగరాజు(32) సోమవారం ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. కొన్నేళ్లుగా ఓ వ్యక్తి దగ్గర ఫైనాన్షియల్ కలెక్షన్ ఏజెంట్గా పని చేస్తున్నాడని ఆర్థిక ఇబ్బందులు కారణంగానే తాను మృతి చెందాడని తండ్రి లక్ష్మణ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దుర్గ ప్రసాద్ తెలిపారు.
Similar News
News September 19, 2025
ఎచ్చెర్ల: యూనివర్సటిలో సంస్కృతి కోర్సు ప్రారంభం

ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటిలో సంస్కృతి కోర్సును వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ కే ఆర్ రజిని ఇవాళ ప్రారంభించారు. ఈ మేరకు జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పీఎం ఉష నిధుల ఆర్థిక సహకారంతో సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సును మొదలపెట్టామని చెప్పారు. సంస్కృతం భాష నుంచే మిగతా భాషలు వృద్ధి చెందాయని తెలియజేశారు.
News September 18, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

▶మెళియాపుట్టి: గ్రానైట్ క్వారీ వద్దు.. గ్రామం ముద్దు
▶జిల్లాలో పలుచోట్ల యూరియా కోసం రైతుల అవస్థలు
▶SKLM: ఎంపీ నిధులతో ప్రాంతీయ ప్రాంతాల అభివృద్ధి
▶GST 2.0పై మాట్లాడిన ఎమ్మెల్యే గౌతు శిరీష
▶బూర్జ: ధర్మల్ ప్లాంట్ నిర్మాణం మానుకోవాలి
▶పొందూరు: ఈ ప్రయాణాలు..ప్రమాదం
▶సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే శంకర్
▶రైతు సమస్యలపై సభలో చర్చిస్తాం: అచ్చెన్నాయుడు
News September 18, 2025
సంతబొమ్మాళి: మూలపేట పోర్టులో కార్మికుడు మృతి

సంతబొమ్మాళి (M)మూలపేట పోర్టులో పనిచేస్తున్న కార్మికుడు పింగ్వా(36) గురువారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..జార్ఖండ్కు చెందిన పింగ్వా రెండు వారాల కిందట మూలపేట పోర్ట్లో కూలీగా పని చేసుందుకు వచ్చాడని, గత మూడు రోజులగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడని చెప్పారు. దీనిపై ఎస్సై నారాయణాస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.