News December 9, 2024
నరసన్నపేట- ఇచ్ఛాపురం హైవేను 6 లైన్లకు విస్తరించాలి
రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగమయ్యేలా స్థానిక జిల్లా మీదుగా ఉన్న జాతీయ రహదారి -16ను మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దీనికి అనుగుణంగా నరసన్నపేట – ఇచ్ఛాపురం మధ్య ఉన్న జాతీయ రహదారిని 6 లైన్లకు విస్తరించాలని హైవే అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఉన్నారు.
Similar News
News January 17, 2025
సంతబొమ్మాళి: మనస్తాపంతో సూసైడ్: ఎస్సై
పురుగు మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంతబొమ్మాళిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి మండలం గొల్లపేట గ్రామానికి చెందిన పాలిన వీరస్వామి బుధవారం భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేశామని ఎస్సై సింహాచలం తెలిపారు.
News January 17, 2025
SKLM: ‘దివ్యాంగులను ప్రోత్సహించాలి’
దివ్యాంగులలో సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించాలని, వారు ఎందులోనూ తీసిపోరని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి కవితతో కలసి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని తెలిపారు.
News January 17, 2025
పలాస: సముద్ర స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతు
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన జంగం తరుణ్(16) శుక్రవారం సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. బయటకు రాకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండగ సెలవులకు సరదాగా గడుపుతున్న సమయంలో ఇలా జరగడం బాధాకరమని స్థానికులు అన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.