News March 24, 2024

నరసన్నపేట: ఏకైక మహిళా MLA ఈవిడే

image

నరసన్నపేటలో పోటీ చేసిన, విజయం సాధించిన ఏకైక మహిళగా బి.సరోజమ్మ నిలిచారు. ఈవిడ 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి సిమ్మ జగన్నాదంపై 2,454 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. కాగా ఇప్పటివరకు నరసన్నపేట నియోజకవర్గంలో జరిగిన 16 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక మహిళ ఈవిడే కావడం విశేషం.

Similar News

News October 31, 2025

SKLM: ‘పోటీ పరీక్షలకు మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ’

image

మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనారిటీ అభ్యర్థులకు ఎస్.ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ED కె.కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం జిల్లాల్లో ఆసక్తి గల అభ్యర్థులు https://apcedmmwd.org వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 30, 2025

SKLM: పోలీస్ కుటుంబానికి రూ.కోటి అందజేత

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న జగదీష్ కుటుంబానికి రూ.కోటిలను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ ఏడాది జూన్ నెలలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా ఈ నష్టపరిహారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిందని SP పేర్కొన్నారు. ఖాతాలకు పోలీస్ శాలరీ ప్యాకేజ్ అనుసంధానం చేసుకోవాలన్నారు.

News October 30, 2025

కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి

image

కొత్తూరు మండలం కడుమ సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎం మాలతీబాయి (48) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రం కాశీనగరంలో నివాసం ఉంటూ ప్రతిరోజూ విధులకు కడుమ సచివాలయానికి ద్విచక్ర వాహనంపై వస్తుంటారు. ఇవాళ విధులకు వస్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురై మాలతీ బాయి మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.