News October 23, 2024

నరసన్నపేట: కూటమి ప్రభుత్వంలో వరస అత్యాచారాలు

image

కూటమి ప్రభుత్వము రాష్ట్రంలో ఆటవిక పరిపాలనను కొనసాగిస్తోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 120 రోజులలో దాదాపు 74 మంది యువతులు, బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని, ఇంత ఘోరమైన పాలన చేస్తున్న వీరు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రతీకార చర్యలకు వినియోగిస్తున్నారని దుయ్యబట్టారు.

Similar News

News November 26, 2025

SKLM: ఎస్పీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు. అంబేడ్కర్ చిరస్మరణీయులని ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. చట్ట పాలనను సాగించడంలో పోలీసులు ముందుండాలన్నారు.

News November 26, 2025

ఘోర ప్రమాదం.. ఇద్దరు సిక్కోలు వాసుల మృతి

image

తమిళనాడు రామేశ్వరం సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలాస(M) పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయ్యప్పమాల ధరించి పలువురు శబరిమలై, రామేశ్వరం వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్(24), పైడి సాయి(26)గా పోలీసులు గుర్తించారు. గుంట రాజు, పైడి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మినేని గణేశం గాయపడ్డారు.

News November 26, 2025

శ్రీకాకుళం జిల్లాలో మార్పులు ఇవే..!

image

శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్‌లోని నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పలాస రెవెన్యూ డివిజన్ 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఈ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, నందిగాం, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాలు ఈ డివిజన్‌లో ఉన్నాయి. తాజాగా నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.