News October 31, 2024

నరసన్నపేట: గడ్డయ్య చెరువులో పడి ఒకరు మృతి

image

నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక దేశవానిపేట వద్ద ఉన్న గడ్డయ్య చెరువులో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సిహెచ్ దుర్గ ప్రసాద్ వివరాలు ప్రకారం.. బుధవారం రాత్రి స్నానానికి బగ్గు సూర్యనారాయణ (45) చెరువులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అయితే రాత్రి కావడంతో అటువైపు ఎవరూ వెళ్లలేదు. కుటుంబ సభ్యులు గురువారం చెరువులో చనిపోయి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేశారు.

Similar News

News November 11, 2024

SKLM: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 35 వేల మందికిపైగా చదువుతున్నారు. అక్టోబర్ 21 నుంచి చెల్లింపు మొదలవ్వగా వీరంతా ఈ నెల 11వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

News November 11, 2024

భోగాపురం ఎయిర్ పోర్టును 2026కి పూర్తి: కేంద్ర మంత్రి

image

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే భోగాపురం ఎయిర్ పోర్టు పనులను లక్ష్యం కంటే ముందుగానే 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెళ్లడించారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదివారం 6వ సారి ఆయన ఏర్పోర్టు పనులను పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

News November 10, 2024

శ్రీకాకుళం జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డులు వీరే..!

image

లావేరు మండలం గోవిందపురం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుంటముక్కల శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే బూర్జ మండలంలోని ఓవీ పేట ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బొడ్డేపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కావడం గమనార్హం.