News September 22, 2024

నరసన్నపేట: తాటి చెట్టులో రావి మొక్క

image

నరసన్నపేట మండలం పెద్ద కరగాంలో ఉన్న నరికివేసిన తాటి చెట్టు మొండెం నుంచి రావి మొక్క రావడంతో గ్రామస్థులు ఆసక్తిగా చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ చెట్టును నరికి వేశారు. పక్షులు గింజలను చెట్ల తొర్రలో వేయడంతో రావి మొక్క వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు. అటుగా వెళ్లే ప్రయాణికులు సైతం పైన చెట్టు రావడడంతో ఆగి మరీ చూస్తున్నారు.

Similar News

News November 23, 2025

ఈ అంబులెన్స్ ప్రజా సేవకు అంకితం: కలెక్టర్

image

కొత్తగా కొనుగోలు చేసిన ఆంబులెన్స్‌ను ప్రజాసేవకు అంకితం చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో కొత్త ఆంబులెన్స్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఆంబులెన్స్ పాడైపోవడంతో ఆ సంస్థ ఛైర్మన్ జగన్మోహన్రావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త వాహనానికి రూ. 19.54 లక్షలు విడుదల చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News November 22, 2025

మందస: లారీ ఢీకొని ఒకరు మృతి

image

లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మందస మండలం బాలిగాం బ్రిడ్జి సమీపాన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పలాస నుంచి ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై గుడ్లు లోడుతో వెళ్తున్న లారీ బాలిగాం బ్రిడ్జ్ సమీపాన బైక్‌ను ఢీకొంది. క్షతగాత్రుడికి తీవ్ర గాయలవ్వగా హరిపురం సీహెచ్‌సీకి తరలిస్తుండగా మరణించాడు. మృతుడు శాసనం గ్రామానికి చెందిన ధర్మారావు(45)గా సమాచారం. పోలీసు కేసు నమోదైంది.