News October 21, 2024
నరసన్నపేట: ‘నా నిర్ణయంతోనే బిడ్డ చనిపోయింది’

నరసన్నపేట సత్యవరం సర్కిల్ హైవే వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. పోలాకి(M) జిల్లేడువలసకు చెందిన <<14408762>>భవ్య(17)<<>>, ఆమె తండ్రి గౌరేష్, రామరావు(48) శ్రీకాకుళం సమీపంలోని పరదేశిపాలెంలో పెళ్లికి వెళ్లారు. భవ్యకు సోమవారం పరీక్ష ఉండటంతో గౌరేష్ అక్కడే ఉండిపోయి.. భవ్యను రామారావుతో బైకుపై పంపగా లారీ ఢీకొని ఇద్దరూ చనిపోయారు. తన నిర్ణయంతోనే బిడ్డ చనిపోయిందని గౌరేశ్ బోరున విలపించారు.
Similar News
News November 12, 2025
హిరమండలం: పెన్షన్ మంజూరు చేయాలని వేడుకోలు

హిరమండలంలోని భగీరధపురం గ్రామానికి చెందిన హరిపురం ఆదిలక్ష్మి (32) పుట్టుకతో వికలాంగురాలు. ఈమెకు బయోమెట్రిక్ పడకపోవడంతో తండ్రిని నామినీగా ఉంచి పింఛన్ అందిస్తూ వచ్చారు. రెండేళ్ల క్రిందట తండ్రి మరణించడంతో పింఛనుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె వాపోయింది. సాంకేతిక కారణాలను తొలగించి పింఛను అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.
News November 12, 2025
SKLM: నవంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ జునైద్ అహమ్మద్ మౌలానా పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్టులో ఉన్న న్యాయ సేవ అధికారి సంస్థ కార్యాలయంలో మంగళవారం ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం జరిగేందుకు కృషి చేయాలన్నారు.
News November 11, 2025
SKLM: ఛైన్ స్నాచర్ అరెస్టు..10 తులాల బంగారం స్వాధీనం

ఒంటరి మహిళలలే లక్ష్యంగా ఛైన్ స్నాచింగ్ పాల్పడిన ముహేశ్వర్ దళాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది ఇచ్ఛాపురం, మందస, కవిటి, కాశీబుగ్గ PSలలో నిందితుడిపై దొంగతనం కేసులు నమోదవ్వగా దర్యాప్తు చేపట్టారు. ఇవాళ కాశీబుగ్గ కోసంగిపురం జంక్షన్ వద్ద ముద్దాయిని అదుపులోకి తీసుకుని 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దళాయ్ చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేశాడని SP కేవీ మహేశ్వరెడ్డి మీడియాకు తెలిపారు.


