News August 2, 2024
నరసన్నపేట: పెన్షన్ పంపిణీలో అలసత్వం.. 30 మందికి నోటీసులు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం నగదు పంపిణీలో అలసత్వం ప్రదర్శించిన 30 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులిచ్చినట్లు నరసన్నపేట ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 5.30 గంటలకు పెన్షన్ ప్రారంభించాల్సి ఉండగా 6.30 గంటలు వరకు కూడా నగదు పంపిణీని సిబ్బంది ప్రారంభించలేదన్నారు. దీంతో వారికి నోటీసులిచ్చినట్లు తెలిపారు.
Similar News
News November 4, 2025
ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి: మంత్రి అచ్చెన్న

శ్రీకాకుళం జిల్లాలో మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళిలోని నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలిచిందన్న సంతృప్తి రైతుల్లో కలగాలన్నారు.
News November 4, 2025
శ్రీకాకుళం: ఆమె నేత్రాలు సజీవం

శ్రీకాకుళంలోని అరసవల్లికి చెందిన మాడుగుల. ఇందిరా (36) ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత, చిన్ని కృష్ణ ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
News November 4, 2025
మెళియాపుట్టి: ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా..!

ప్రతిరోజూ ఏదోక చోట బస్సు ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ కొందరి వైఖరిలో మార్పులు రావడం లేదు. ఈ నేపథ్యంలో మెళియాపుట్టి (M) గొప్పిలిలో ప్రయాణికులు ఫుట్ బోర్డుపై వేలాడుతూ వెళ్తున్న దృశ్యం నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లు కనిపిస్తోంది. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోక ముందే అధికారులు తనిఖీలు చేపట్టి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


