News September 15, 2024
నరసన్నపేట: మద్యం సీసాలో బొద్దింక
మద్యం సీసాలో బొద్దింకని చూసి మందుబాబు నివ్వెరపోయాడు. కోమర్తి గ్రామానికి చెందిన అప్పన్న నరసన్నపేట బండివీధి సమీపంలో ఓ ప్రభుత్వ దుకాణంలో ఈ నెల 12న మద్యంసీసా కొనుగోలు చేశాడు. అనంతరం పరిశీలించగా అందులో బొద్దింక కనిపించింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎక్సైజ్ సీఐ లక్ష్మి వద్ద ప్రస్తావించగా తమ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News October 14, 2024
SKLM: నేడు మద్యం దుకాణాలు లాటరీ
శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాలను సోమవారం లాటరీ పద్ధతిలో దరఖాస్తుదార్లకు కేటాయించనున్నారు. నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ మొదలు కానుంది. జిల్లావ్యాప్తంగా 158 దుకాణాలకు గాను, 4670 దరఖాస్తులు వచ్చాయి. మద్యాన్ని ప్రయివేట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం వెలువరించిన విధివిధానాలకు లోబడి ఈప్రక్రియ జరగనుంది. స్టేషన్ల వారీగా ఆడిటోరియంలోకి పిలిచి లాటరీ తీస్తారు.
News October 13, 2024
ముగిసిన సెలవులు.. రేపటి నుంచే స్కూల్స్, కాలేజీలు
శ్రీకాకుళం జిల్లాలో రేపటి నుంచి పాఠశాలు, ఇంటర్ కాలేజీలు తెరుచుకొనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ఇవ్వగా నేటితో ముగిశాయి. అలాగే మరో పక్క జిల్లాలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు ఈనెల 7వ తేదీ నుంచి సెలవులు ప్రకటించగా నేటితో ముగియనున్నాయి. దీనితో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి.
News October 13, 2024
లావేరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
లావేరు మండలం కేశవరాయనిపాలెం పంచాయతీ హనుమయ్యపేట గ్రామానికి చెందిన నాయిని చంటి (26) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. నిన్న మురపాకు టిఫిన్‌కు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొంది. భర్త మృతి చెందడంతో భార్య భవాని ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం భవాని మూడు నెలల గర్భవతి. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.