News April 10, 2025

నరసన్నపేట : ముగ్గుల పోటీల్లో రూ. 25 లక్షల ప్రైజ్ మనీ

image

ముగ్గుల పోటీలలో నరసన్నపేటకు చెందిన మహిళ రూ.25 లక్షలు గెలుచుకున్నారు. ఆంధ్రా అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆన్‌లైన్‌ విధానంలో పోటీలు నిర్వహించారు. ఇందులో సునీత మొదటి బహుమతిని గెలుచుకున్నారు. లక్షల రూపాయలు గెలుచుకోవడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.  

Similar News

News October 21, 2025

శ్రీకాకుళం జిల్లాలోని ముఖ్య శైవ క్షేత్రాలు..!

image

రేపటి నుంచి కార్తీక మాసం మొదలుకానుంది. దీంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన శైవ క్షేత్రాలు ముస్తాబు కానున్నాయి. ముఖ్యంగా శ్రీముఖలింగేశ్వర దేవాలయం (జలుమూరు),
శ్రీ ఉత్తరేశ్వర స్వామి దేవాలయం (బలగ),
సంఘమేశ్వర ఆలయం(ఆమదాలవలస),
కోటేశ్వరస్వామి ఆలయం(శ్రీకాకుళం),
ఎండల మల్లికార్జున ఆలయం (రావివలస) క్షేత్రాలకు భక్తుల తాకిడి ఉండనుంది.

News October 21, 2025

కవిటి: ఆ గ్రామం ఆదర్శం..!

image

కవిటి (M) పొందూరు పుట్టుగ గ్రామం దీపావళి పండగకు దూరంగా ఉంది. కారణం ఏమిటంటే..? ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు దూగాన రామ్మూర్తి (44), ప్రణయ్ (17) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపావళి నాడు బాధిత కుటుంబంలో అమావాస్య చీకట్లు అల్లుకున్నాయని గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

News October 21, 2025

ఎంపీ కలిశెట్టి దీపావళి వేడుకలు భళా

image

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రణస్థలం ప్రభుత్వ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులకు స్వీట్స్ పంచి వారితో బాణాసంచా కాల్చారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బాలికలతో ఇలా దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.