News September 18, 2024
నరసన్నపేట: వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం
నరసన్నపేట మండలం దూకులపాడు పంచాయతీ తండ్యాలవానిపేటకు చెందిన శిమ్మ దివ్య అత్తింటి వేధింపులు కారణంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు హుటాహుటిన నరసన్నపేటలోని ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి మంగళవారం రాత్రి తరలించారు. దివ్య తల్లి ఆదిలక్ష్మి నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎస్సై దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమన్నారు.
Similar News
News October 15, 2024
శ్రీకాకుళం: ‘స్వర్ణాంధ్ర -2047 ఆర్థిక వృద్ధికి పక్కా ప్రణాళిక ఉండాలి’
స్వర్ణాంధ్ర-2047 నాటికి ఆర్థిక వృద్ధి రేటు పెంచే దిశగా ప్రణాళికలు ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. సోమవారం స్వర్ణాంధ్ర-2047 పై మండల, జిల్లాల విజన్ ప్లానింగ్ పై జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.
News October 14, 2024
శ్రీకాకుళం జిల్లాలో 158 పేర్లు ఖరారు
శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కళావేదికలో ప్రారంభమైన మద్యం షాపులు కేటాయింపులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లాటరీ నిర్వహించారు. జిల్లాలో 158 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో 158 పేర్లు ఖరారు చేసినట్లు వారు పేర్కొన్నారు.
News October 14, 2024
శ్రీకాకుళంలో 113 మద్యం షాపుల పేర్ల ప్రకటన
శ్రీకాకుళం నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కళావేదిలో ప్రారంభమైన మద్యం షాపులు కేటాయింపులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి, ఆర్డీవో కె.సాయి ప్రత్యూషలు లాటరీ నిర్వహణ చేపట్టారు. ఇప్పటి వరకు 113 మద్యం షాపుల పేర్లు లాటరీ పద్ధతిలో ప్రకటించినట్లు వారు తెలిపారు.