News October 26, 2024
నరసన్నపేట: వేధింపుల కేసులో భర్తకు రెండేళ్ల జైలు శిక్ష

భార్య వేధింపులకు గురి చేస్తున్న భర్తకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి చందక హరిప్రియ తెలిపారు. నరసన్నపేట స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఈ మేరకు ఆమె తీర్పు వెలువరించారు. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక గాంధీనగర్-1లో నివాసం ఉంటే బోనెల సాంబశివరావు, భార్య నాగలక్ష్మీపై వేధింపులకు పాల్పడటంతో 2022లో నరసన్నపేట ఠాణాలో బాధితురాలు ఫిర్యాదు చేశారు.
Similar News
News December 20, 2025
శ్రీకాకుళం: హాట్ హాట్‌గా జడ్పీ సర్వసభ్య సమావేశం

శ్రీకాకుళంలో జడ్పీ సర్వసభ్య సమావేశం హాట్ హాట్‌గా సాగుతోంది. ఉపాధి హామీ నిధుల వినియోగం, సచివాలయాలు, RBKల నిర్మాణాల పనుల బిల్లులు రాలేదని సభ్యులు ప్రశ్నించగా సంబంధిత అధికారులు బిల్లులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే కూన రవికుమార్ కలగజేసుకున్నారు. అయితే కేవలం వైసీపీనే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ సభ్యులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. పరస్పర ఆరోపణలతో సభ హీట్ ఎక్కింది.
News December 20, 2025
వజ్రపుకొత్తూరు: బీచ్‌లో వెనక్కి వెళ్లిన సముద్రం

వజ్రపుకొత్తూరు మండలంలోని శివ సాగర్ బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లింది. ఒక్కసారిగా 50 మీటర్ల మేర వెనకకు వెళ్లడంతో పర్యాటకులు ఈ వింతను చూసేందుకు తరలివచ్చారు. దీనికి తోడు ఎంతో తక్కువ ఎత్తులో అలలు ఎగిసిపడుతూ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదించారు. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.
News December 20, 2025
శ్రీకాకుళంలో సరిపడా యూరియా నిల్వలు

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌కు యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయాధికారి కె.శ్రీనాథ స్వామి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 26,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధం చేశామన్నారు. అక్టోబరు 1 నుంచి ఇప్పటివరకు 7,811 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరగ్గా, ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలు, మార్క్ ఫెడ్ ప్రైవేట్ డీలర్ల వద్ద 2,020 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయన్నారు.


