News July 4, 2024
నరసన్నపేట: ‘104 సిబ్బంది సమస్యలను పరిష్కరించండి’

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన 104 వైద్య సేవలలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రమణమూర్తికి వినతి పత్రం సమర్పించారు. బుధవారం జిల్లాలోని 104 సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తాము వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తూనే ఉన్నామని, కాని తమ సమస్యలు పరిష్కారం అవ్వడంలేదని ఆయనకు విన్నవించుకున్నారు.
Similar News
News November 26, 2025
SKLM: ఎస్పీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు. అంబేడ్కర్ చిరస్మరణీయులని ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. చట్ట పాలనను సాగించడంలో పోలీసులు ముందుండాలన్నారు.
News November 26, 2025
ఘోర ప్రమాదం.. ఇద్దరు సిక్కోలు వాసుల మృతి

తమిళనాడు రామేశ్వరం సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలాస(M) పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయ్యప్పమాల ధరించి పలువురు శబరిమలై, రామేశ్వరం వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్(24), పైడి సాయి(26)గా పోలీసులు గుర్తించారు. గుంట రాజు, పైడి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మినేని గణేశం గాయపడ్డారు.
News November 26, 2025
శ్రీకాకుళం జిల్లాలో మార్పులు ఇవే..!

శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్‌లోని నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పలాస రెవెన్యూ డివిజన్ 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఈ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, నందిగాం, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాలు ఈ డివిజన్‌లో ఉన్నాయి. తాజాగా నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.


