News December 29, 2024

నరసరావుపేటలో సీఎం పర్యటన ఇలా.!

image

నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి ఈనెల 31న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. 11.40 వరకు పింఛన్లు అందజేస్తారు. అనంతరం గ్రామంలోని ఆలయాన్ని సీఎం సందర్శిస్తారు. మధ్యాహ్నం కోటప్పకొండకు చేరుకొని 2.20కి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. భోజనం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకొని 3.10లకు ముఖ్యమంత్రి తిరిగి ఉండవల్లి చేరనున్నారు.  

Similar News

News January 19, 2025

గుంటూరులో CA విద్యార్థి ఆత్మహత్య

image

బ్రాడీపేటలో ఆత్మహత్యకు పాల్పడింది CA చివరి సంవత్సరం చదువుతున్న కె.నాగప్రసాద్ (27) గా అరండల్ పేట పోలీసులు నిర్ధారించారు. గూడూరు పట్టణానికి చెందిన నాగప్రసాద్ ఆదివారం హాస్టల్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. ఈ ఘటనతో విజ్ఞాన కేంద్రానికి చిరునామాగా ఉన్న బ్రాడీపేటలో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నాగప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News January 19, 2025

పిట్టలవానిపాలెంలో రోడ్డు ప్రమాదం

image

పిట్టలవానిపాలెం మండలం భావనారాయణపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. 

News January 19, 2025

డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద పోలీసుల విచారణ

image

మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం అలాగే జాతీయ పార్టీ కార్యాలయం వద్ద శనివారం డ్రోన్ కలకలం రేపిన సంగతి విధితమే. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులు క్యాంపు కార్యాలయం వద్ద విచారణ చేపట్టారు. డ్రోన్ ఎవరు ఎగరవేశారు, ఎటువైపు నుంచి డ్రోన్ వచ్చింది అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పవన్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.