News February 4, 2025

నరసరావుపేట: అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి

image

పేద కుటుంబాల వారు తమ పిల్లలను అంగన్వాడీ సెంటర్ల ద్వారా చదివించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సూచించారు. మంగళవారం పేద కుటుంబాలకు చెందిన వారికి మూడు చక్రాల రిక్షాలను అందజేశారు. పేదరికం నుంచి చదువు మాత్రమే బయటికి తీసుకువస్తుందన్నారు. చిన్నారులను చిత్తు కాగితాలు ఏరుకునేందుకు పంపవద్దని తల్లిదండ్రులను కలెక్టర్ కోరారు. ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో మధులత ఉన్నారు.

Similar News

News December 2, 2025

పాపవినాశనం డ్యాంపై శాస్త్రవేత్తల పరిశీలన

image

తిరుమలలోని పాపవినాశనం డ్యాంను ముగ్గురు శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. డ్యాం సేఫ్టీ ఎవల్యూషన్లో భాగంగా జలవనరుల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి చెందిన శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. నీటి నిల్వతో పాటు పలు జాగ్రత్తలపై రిమోట్ ఆపరేటింగ్ వెహికల్‌తో పరిశీలించారు.

News December 2, 2025

ఏపీ వాట్సాప్ గవర్నెన్స్‌కు అత్యధిక హిట్స్

image

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్‌కు తొలిసారిగా అత్యధిక హిట్స్ టీటీడీ వల్ల వచ్చింది. నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన డిప్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం చూస్తే 1.5 లక్షల మంది భక్తులు తమ పేర్లు ఈ డిప్‌లో వాట్సప్ ద్వారా నమోదు చేసుకున్నారు. ఈ సేవ వచ్చిన తర్వాత 3 రోజుల్లో ఇన్ని హిట్స్ రావడం ఇదే అత్యధికమని అంటున్నారు.

News December 1, 2025

PDPL: ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు లేకుండా చూడాలి: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ర్యాండమైజెషన్‌ను పరిశీలించిన ఆయన, సిబ్బంది కేటాయింపు నిబంధనల ప్రకారం ఉండాలని తెలిపారు. నామినేషన్లు టి–యాప్‌లో నమోదు చేయాలని, అవసరమైన సామగ్రి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులు సమయానికి అందించాలని సూచించారు.