News April 10, 2025
నరసరావుపేట: అక్రమ రవాణా జరగకుండా చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. కలెక్టరేట్లో JC సూరజ్, ASP సంతోష్‌తో కలిసి గురువారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. రాబోయే వర్షా కాలంలో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిలువ సాధ్యంపై చర్చించారు. మాన్యువల్ రీచ్‌లు పట్టా లాండ్ డీ కాస్టింగ్ ఓపెన్ రీచ్‌ల కార్యకలాపాల ద్వారా కావలసిన ఇసుక సాధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News October 17, 2025
వంటింటి చిట్కాలు

* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి.
* అరటిపండ్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి, ఫ్రిజ్‌లో పెడితే నల్లగా మారవు.
<<-se>>#VantintiChitkalu<<>>
News October 17, 2025
జనసేన అభిమాని అర్జున్ మృతిపై లోకేశ్ దిగ్భ్రాంతి

కర్నూలులో నిన్న జరిగిన జీఎస్టీ సభలో విద్యుత్ షాక్ తగిలి జనసేన అభిమాని అర్జున్ (15) మృతిపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతి తనను కలచివేసిందని పేర్కొన్నారు. అర్జున్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. మరోవైపు మృతుడి కుటుంబానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అర్జున్ కర్నూలు మండలం మునగాలపాడు గ్రామానికి చెందిన వారు.
News October 17, 2025
BCCI అపెక్స్ కౌన్సిల్లో చాముండేశ్వరనాథ్

భారత మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ చాముండేశ్వరనాథ్‌కు BCCI అత్యున్నత కమిటీలో చోటు దక్కింది. బోర్డు అపెక్స్ కౌన్సిల్లో ICA ప్రతినిధిగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఆన్లైన్ ఓటింగ్‌లో వి.జడేజాపై ఆయన గెలుపొందారు. దీంతో అపెక్స్ కౌన్సిల్‌కు ఎంపికైన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు. రాజమండ్రికి చెందిన ఈయన ఆంధ్ర తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడారు. జాతీయ జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గానూ పనిచేశారు.