News March 26, 2025

నరసరావుపేట: ‘అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి’

image

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కోసం ప్రతిష్ఠాత్మకమైన ప్రధాన మంత్రి యోగా అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యోగా అభివృద్ధికి అత్యుత్తమ సహకారం అందించిన, వ్యక్తులు సంస్థలు అర్హులని అన్నారు. https://innovateindia.mygov.in/pm-yoga-awards-2025/ ఆన్‌లైన్‌లో మార్చి 31లోగా పోర్టల్ ద్వారా, లేదా స్వయంగా దరఖాస్తులను సమర్పించాలన్నారు. 

Similar News

News September 16, 2025

చిత్తూరు DCMS ఛైర్మన్ మృతి

image

చిత్తూరు డీసీఎం ఛైర్మన్, టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు పల్లిమేమి సుబ్రహ్మణ్యం నాయుడు మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకోలేక తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.

News September 16, 2025

గోపాలపట్నంలో దారుణ హత్య

image

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2025

పోషకాహారంతో ఆరోగ్యకర జీవనం: ములుగు కలెక్టర్

image

పోషకాహారంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. 8వ రాష్ట్రీయ పోషణ్‌లో భాగంగా నెల రోజులు నిర్వహించే కార్యక్రమాలపై ఐసీడీఎస్, హెల్త్, విద్య, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని, పోషకాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు.