News March 26, 2025

నరసరావుపేట: ‘అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి’

image

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కోసం ప్రతిష్ఠాత్మకమైన ప్రధాన మంత్రి యోగా అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యోగా అభివృద్ధికి అత్యుత్తమ సహకారం అందించిన, వ్యక్తులు సంస్థలు అర్హులని అన్నారు. https://innovateindia.mygov.in/pm-yoga-awards-2025/ ఆన్‌లైన్‌లో మార్చి 31లోగా పోర్టల్ ద్వారా, లేదా స్వయంగా దరఖాస్తులను సమర్పించాలన్నారు. 

Similar News

News April 22, 2025

కైరిగూడ ఓపెన్ కాస్ట్‌లో 100% బొగ్గు ఉత్పత్తి

image

బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్‌లో 100% బొగ్గు ఉత్పత్తి సాధించడం అభినందనీయమని ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం కైరిగూడ ఓపెన్ కాస్ట్‌ను సందర్శించిన ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. బొగ్గు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూనే ఈ వార్షిక సంవత్సరంలోనూ 100%ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలన్నారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ నరేందర్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న పాల్గొన్నారు.

News April 22, 2025

భూ భారతిపై ఎలాంటి అపోహలు వద్దు: కలెక్టర్ గౌతమ్ 

image

భూభారతి చట్టంపై ఏలాంటి అపోహాలు పెట్టుకోవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చి నివృత్తి చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. మంగళవారం శామీర్ పేట మండలం తూంకుంటలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగహన కల్పించారు. ప్రభుత్వం రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News April 22, 2025

అమిత్ షా‌కు ప్రధాని మోదీ ఫోన్

image

సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న PM నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌కు ఫోన్ చేశారు. జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఘటనా‌స్థలికి వెళ్లి పరిశీలించాలని అమిత్ షాను PM ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడిలో ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!