News February 27, 2026
నరసరావుపేట ఆర్టీవో బాధ్యతల నుంచి రిలీవ్

నరసరావుపేట ఆర్డీవో మధులతను బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. 2018 గ్రూప్-1 నియామకాలపై ఏపీ హైకోర్టులో కొనసాగుతున్న న్యాయ ప్రక్రియ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ నియామకాల ద్వారా చేరిన అధికారులను తాత్కాలికంగా పోస్టుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అదే క్రమంలో మధులత కూడా రిలీవ్ చేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 26 మంది అధికారులను రిలీవ్ చేశారు.
Similar News
News April 15, 2026
ముగింపు దశలో యుద్ధం.. కానీ: ట్రంప్

ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌తో యుద్ధం ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందన్నారు. అయితే అమెరికా పని ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ‘వారు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే మా బలగాలను ఉపసంహరించుకుంటే ఆ దేశాన్ని తిరిగి నిర్మించుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు.
News April 15, 2026
ప.గో: ప్రేమ విఫలమై యువకుడు సూసైడ్!

భీమవరం కొత్త బస్టాండ్ వద్ద కృష్ణా జిల్లా బంటుమిల్లి(M) మల్లిపూడికి చెందిన రాజేశ్(23) ఈనెల 3వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా ఈనెల 13న మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ విఫలం కావడమే ఆత్మహత్యకు కారణమని తెలిపారు.
News April 15, 2026
నిజామాబాద్: అంగన్‌వాడీ.. డిజిటల్ వే

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 3,250 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటికి కొత్త ఫోన్లను అందజేస్తున్నారు. పాత ఫోన్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల డేటా నమోదులో జాప్యం జరుగుతోందని గుర్తించిన యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ టీచర్లు కొత్త ఫోన్ల రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


