News January 31, 2025
నరసరావుపేట: ఆర్టీసీ బస్సులో రూ. 2 లక్షలు చోరీ

ఆర్టీసీ బస్సులో పర్స్ కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై వన్టౌన్ సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కె.సుజాత గుంటూరు వెళ్ళేందుకు బస్టాండ్కి వచ్చారు. బస్సు ఎక్కిన తర్వాత పర్సులో ఉండాల్సిన నగదు మాయమైంది. పర్స్ కింది భాగం కత్తిరించి ఉండటం గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 1, 2025
ఘనంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం స్వామివారి కళ్యాణం జరిగింది. కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8 గంటలకు అనివేటి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం జరిగిందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
News November 1, 2025
టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ <
News November 1, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 తగ్గి రూ.1,23,000కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పతనమై రూ.1,12,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,66,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


