News March 22, 2025
నరసరావుపేట: ఈవీఎం గోడౌన్ల తనిఖీ చేసిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎంలను శనివారం తనిఖీ చేశారు. గోడౌన్లలో సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. సాధారణ త్రైమాసిక తనిఖీలలో భాగంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. గోడౌన్లలో ఈవీఎంలను భద్రంగా ఉంచాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 30, 2025
రేపు, ఎల్లుండి సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో రేపు రంజాన్ పండుగ జరుపుకోనుండటంతో ప్రభుత్వ బడులు, కాలేజీలు, కార్యాలయాలకు సెలవు ఉండనుంది. APలో రేపు ఒక్క రోజే హాలిడే ఇవ్వగా, TG సర్కారు రేపటితో పాటు APR 1న కూడా సెలవు ప్రకటించింది. బోనాలు, క్రిస్మస్, రంజాన్ తర్వాతి రోజు సెలవుగా ప్రకటించడం గత ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు, సౌదీలో నిన్న నెలవంక కనిపించగా అక్కడ ఇవాళ రంజాన్ జరుపుకుంటున్నారు.
News March 30, 2025
మెదక్: ‘తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు’

మెదక్ జిల్లాలో నేటి నుంచి జూన్ 1 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ బోర్డు శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ అధికారి మాట్లాడుతూ.. సెలవులలో తరగతులు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 30, 2025
NLG: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది విషెష్

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని శుభాలు కలగాలని.. సుభిక్షంగా ఉండాలని పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని పేర్కొన్నారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలాషించారు.