News February 19, 2025

నరసరావుపేట: ఈ కొండపై పరమశివుడు తపస్సు చేశాడు

image

మహాశివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ల ఘనంగా నిర్వహిస్తారు. దీనిని త్రికోటేశ్వర ఆలయం అని కూడా అంటారు. దక్షయజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా సతీ దేవి దేహత్యాగం చేస్తుంది. సతీదేవి వియోగం తర్వాత పరమశివుడు ముల్లోకాలు తిరిగి కోటప్పకొండ చేరుకున్నాడు. పరమశివుడు బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. బాల దక్షిణామూర్తి రూపంలో తపస్సు చేసిన ఆ పవిత్ర స్థలమే త్రికోటేశ్వరాలయముగా పేరుగాంచింది.

Similar News

News December 5, 2025

తిరుమల: VIP బ్రేక్ దర్శనాలు రద్దు

image

శ్రీవారి ఆలయంలో డిసెంబర్ నుంచి జనవరి వరకు జరిగే పలు పర్వదినాలు, ప్రత్యేక కైంకర్యాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిర్ణీత రోజుల్లో టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది. 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29న వైకుంఠ ఏకాదశి ముందు రోజు నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. ఈ తేదీలకు ముందురోజు వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.

News December 5, 2025

వికారాబాద్‌లో 39 GPలు ఏకగ్రీవం

image

వికారాబాద్‌లో ఈ నెల 11న జరగనున్న తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను డీపీవో డా.జయసుధ ప్రకటించారు. జిల్లాలోని 39 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. సీఎం సొంత నియోజకవర్గంలో 13, తాండూరు నియోజకవర్గంలో 27 సర్పంచ్ పీఠాలు ఏకగ్రీవం అయ్యాయి.

News December 5, 2025

పుతిన్‌కు ‘బాడీ డబుల్స్’ ఉన్నారా?

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఆయన ‘బాడీ డబుల్స్’ గురించి చర్చ జరుగుతోంది. బహిరంగ కార్యక్రమాలు, ప్రయాణాలకు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తారని ఊహాగానాలు ఉన్నాయి. పుతిన్‌కు ముగ్గురు డూప్స్ ఉన్నారని ఉక్రెయిన్ గతంలో చెప్పింది. వారు ‘క్లోన్ ఆర్మీ’ అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలని, ‘బాడీ డబుల్’ ప్రతిపాదనలను తాను తిరస్కరించానని గతంలో పుతిన్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.