News February 13, 2026

నరసరావుపేట ఎంపీ ప్రశ్న.. కేంద్రం క్లారిటీ

image

పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ. 27,303.8 కోట్ల కేంద్ర సహాయం అందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నరసరావుపేట ఎంపీ ప్రశ్నకు సమాధానంగా.. ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తయ్యాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ. 5,512.4 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. దీనితో పాటు నేషనల్ స్మార్ట్ గ్రిడ్ మిషన్ కింద ఏపీకి రూ. 72.27 కోట్ల నిధులు జారీ చేసినట్లు స్పష్టం చేసింది.

Similar News

News March 11, 2026

మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్..!

image

ప్రజాబలంలేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకుందామని, ఇందుకు కలిసి పని చేసేందుకు జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు మాతృ పార్టీ సీపీఐలో చేరాలని హైదరాబాద్ మగ్దూం భవన్లో జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల్లో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

News March 11, 2026

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపండి: US

image

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను అమెరికా కోరినట్లు US మీడియా సంస్థ Axios పేర్కొంది. ఇరాన్ ఆయిల్, ఎనర్జీ సదుపాయాలపై మరిన్ని దాడులు చేస్తే ఆ దేశ ప్రజలకు హాని కలగవచ్చని, ఆయిల్ ధరలు భారీగా పెరగొచ్చని US చెప్పినట్లు తెలిపింది. అలాగే గల్ఫ్ దేశాల ఎనర్జీ సదుపాయాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశమూ ఉందని, యుద్ధం తర్వాత ఆయిల్ సెక్టార్‌కు ఇరాన్ సహకారం అవసరమని US భావిస్తోందని వెల్లడించింది.

News March 11, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.