News April 9, 2024
నరసరావుపేట ఎన్నికలలో బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్

రానున్న సార్వత్రిక ఎన్నికలలో పీఓలు భయంతో కాకుండా బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో పిఓలు, ఏఎల్ఎంటీలకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోలింగ్ జరిగే రోజున జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదురైతే చాకచక్యంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు.
Similar News
News January 4, 2026
GNT: సంక్రాంతి వేళ.. కోడి పందేల మార్కెట్ వేడి

సంక్రాంతి పండుగ దగ్గరపడుతుండటంతో కోడి పందేల కోసం కోళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఉమ్మడి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ప్రత్యేకంగా పెంచిన పందెం కోళ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. సాధారణ కోళ్లు రూ.10,000 నుంచి ప్రారంభమై, జాతి, శిక్షణ, బరువు ఆధారంగా రూ.50,000 వరకు ధర పలుకుతున్నాయి. అక్రమంగా జరుగుతున్న పందేలపై నిఘా పెంచినప్పటికీ, డిమాండ్ మాత్రం తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
News January 4, 2026
GNT: త్రిపుర గవర్నర్‌కి ఘన స్వాగతం

గుంటూరు విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డికి ఆదివారం ఘన స్వాగతం లభించింది. ఐటీసీ వెల్కమ్ హోటల్ వద్ద అదనపు ఎస్పీ హనుమంతు, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్రసారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో గవర్నర్ పాల్గొంటారు.
News January 4, 2026
తెనాలి: షార్ట్ ఫిల్మ్ పోటీలకు భారీ స్పందన

తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 11న నిర్వహించనున్న మా-ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అపూర్వ స్పందన లభించిందని దర్శకుడు దిలీప్ రాజ తెలిపారు. ఆదివారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి 203 లఘు చిత్రాలు పోటీకి వచ్చాయన్నారు. యువతలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ వేదికను సిద్ధం చేశామన్నారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు సినీ, కళారంగ ప్రముఖుల జ్ఞాపకార్థం నగదు బహుమతులు అందజేస్తామన్నారు.


