News March 7, 2025
నరసరావుపేట ఎమ్మెల్యే ధర్నా

నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో హల్చల్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వచ్చిన లేఖపై ఎక్సైజ్ కమిషనర్ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే నేరుగా అక్కడికి చేరుకొని నిరసన తెలియజేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఫోన్ చేసినా ఎమ్మెల్యే అంగీకరించలేదని సమాచారం. చివరకు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Similar News
News November 7, 2025
పొగాకు రైతులకు న్యాయం చేద్దాం: కలెక్టర్

ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం సమన్వయం చేసుకొని పొగాకు రైతులకు న్యాయం చేద్దామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం రాత్రి బాపట్ల కలెక్టరేట్ వద్ద మార్కుఫెడ్ డిఎం, పొగాకు ఫ్యాక్టరీల యాజమాన్యంతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం సమన్వయం చేసుకొని పొగాకు రైతులకు న్యాయం చేద్దామని వివరించారు.
News November 7, 2025
మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.
News November 7, 2025
జగిత్యాల: రాయితీ పనిముట్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఉద్యాన యాంత్రీకరణలో భాగంగా రైతులకు వివిధ రకాల పనిముట్లు, యంత్రాల కొనుగోలుపై రాయితీ సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యాంప్రసాద్ తెలిపారు. పవర్ టిల్లర్లు, పవర్ విడర్లు, పవర్ స్పెయర్లూ, బ్రష్ కట్టర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు తమ పరిధికి చెందిన ఉద్యాన అధికారులను లేదా జగిత్యాలలోని ఉద్యాన శాఖ జిల్లా కార్యాలయంలో 15లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.


